![]() |
![]() |

అంజనా ప్రొడక్షన్స్.. తొలి సినిమా రుద్రవీణతోనే జాతీయ అవార్డు పొంది తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన సంస్థ..ఆ తర్వాత ఎన్నో సినిమాలు తీసి అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. విజయవంతంగా సాగుతున్న అంజనా ప్రొడక్షన్స్ ప్రయాణంలో ఆరెంజ్ ఓ భారీ కుదుపు. ఈ సినిమా ఆశించిన లాభాల్ని అందించపోగా..భారీ నష్టాలను మిగిల్చింది. అప్పటి వరకు మంచి రేంజ్‌లో ఉన్న నాగబాబును ఆరెంజ్ పీకల్లోతు కష్టాల్లోకి నెట్టడంతో ఆయన చిత్ర నిర్మాణం నుంచి వైదొలిగి సీరియళ్లు, రియాలిటీ షోలు చేసుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత మెల్ల మెల్లగా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్న నాగబాబు తిరిగి సినిమా నిర్మాణం వైపు దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీని అల్లు అర్జున్ దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌తో కలిసి నాగబాబు నిర్మించనున్నారు. వచ్చే మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
![]() |
![]() |