![]() |
![]() |
.jpg)
టాలీవుడ్ నే కాదు.. యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమ బాహుబలి - ది కన్ క్లూజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేసుకొంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ముందుగానే రాబోతోందా, ఆ అవకాశాలున్నాయా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఏప్రిల్ 28 కంటే ముందే ఈ సినిమాని విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అని చిత్రబృందం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది.
దానికి కారణం... ఇటీవల ఈ సినిమాలోని ఓ సన్నివేశం లీక్ అవ్వడమే అని తెలుస్తోంది. ఫిబ్రవరికల్లా బాహుబలి 2ఫైనల్ కాపీ వచ్చేస్తుంది. ఏప్రిల్ 28 వరకూ అంటే చాలా గ్యాప్ ఉన్నట్టే. ఈలోగా ప్రచారం భారీ ఎత్తున చేసుకోవొచ్చు. అయితే.. బాహుబలిని లీకేజీ భయం పట్టి పీడిస్తోంది. ఈ లోగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఏ రూపంలో అయినా బయటకు వచ్చేస్తే.. అది తమ సినిమాపై పెను ప్రభావాన్ని చూపిస్తుందేమో అని చిత్రబృందం కలవర పడుతోంది. ఏప్రిల్ 28 న రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. అంత ముందస్తుగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడానికి కారణం... బాలీవుడ్ కోసమే.
బాలీవుడ్‌లో ఓ సినిమా వస్తోందంటే యేడాది ముందే రిలీజ్ డేట్ క్లియర్ చేసుకోవాలి. అందుకే... రాజమౌళి టీమ్ తొందరపడింది. సినిమా ఎలాగూ సిద్ధమైపోతుంది కాబట్టి, ముందే సినిమాని విడుదల చేయడం తప్పేం కాదని ఇప్పుడు రాజమౌళి టీమ్ భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయమై రాజమౌళి తన నిర్మాతలతో, బయ్యర్లతో త్వరలోనే చర్చలు జరుపుతారని సమాచారం. వాళ్లంతా ఓకే అంటే.. బాహుబలి 2 అనుకొన్న సమయం కంటే ముందే వచ్చేయొచ్చు. ప్రభాస్ అభిమానులకు, బాహుబలి ప్రేమికులకు ఇంత కంటే శుభవార్త ఏముంటుంది?
![]() |
![]() |