![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హిట్ మూవీ 'బద్రి' ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ అమీషా పటేల్(Ameesha Patel).. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నానిలో కూడా చేసి తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గరయింది. బాలీవుడ్ లో కూడా అందరి అగ్ర హీరోలతో జత కట్టిన అమీషా తాజాగా తన ప్రేమాయణం గురించిన వార్తలతో వార్తల్లో నిలిచారు.
పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ నటుడు ఇమ్రాన్ అబ్బాస్‌తో ఆమె ఉన్న ఒక పాత రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా, రొమాంటిక్‌గా కనిపించడంతో, 51 ఏళ్ల వయసులో అమీషా పటేల్ తన ప్రియుడిని పరిచయం చేసిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ఊహాగానాలు బాలీవుడ్, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న మరో స్టోరీ కూడా ఉంది. గతంలో బహ్రెయిన్‌లో జరిగిన ఈవెంట్ సందర్భంగా అమీషా పటేల్, ఇమ్రాన్ అబ్బాస్ కలుసుకున్నారు. ఆ సమయంలో అమీషా పటేల్ నుంచి వచ్చిన 'క్రాంతి' మూవీలోని 'దిల్ మే దర్ద్ సా' అనే పాపులర్ రొమాంటిక్ సాంగ్‌ని వీరిద్దరూ కలిసి రీక్రియేట్ చేస్తూ ఒక ఫన్ వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోని అమీషా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో అప్పట్లోనే అది సెన్సేషన్ సృష్టించింది. ఆ పాత వీడియోనే ఇప్పుడు నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చి వైరల్ చేస్తున్నారు. ఈ ప్రేమాయణం వార్తలపై గతంలోనే నటి అమీషా పటేల్ గట్టిగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం ఒంటరిగాఉండటం వల్లే ఇరు దేశాల మీడియా మరియు నెటిజన్లు ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారు. భారత్, పాక్ సరిహద్దులని దాటిన తమ స్నేహం చాలా పవిత్రమైనది. అందులో ఎలాంటి దాపరికాలు లేవని చెప్పుకొచ్చింది.
Also Read: shah rukh khan: షారుఖ్ ఖాన్ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా
ప్రస్తుతం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అమీషా, 'గదర్ 2' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో దాదాపు 500 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. కెరీర్‌పై ఫోకస్ పెడుతున్న తరుణంలో ఇలాంటి రూమర్స్ రావడం సర్వసాధారణమే అయినప్పటికీ, ఈ క్యూట్ అండ్ రొమాంటిక్ వీడియో మాత్రం ఇరు దేశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌గా కొనసాగుతోంది. అమీషా వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు.

![]() |
![]() |