![]() |
![]() |

బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్‌ను పెంచి పోషించడంలో కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఎంతగా ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా అవుట్‌సైడర్స్ అయిన టాలెంటెడ్ హీరోయిన్లను ప్రోత్సహిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది మరో క్రేజీ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ సారథ్యంలో నడుస్తున్న ఈ బడా నిర్మాణ సంస్థ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోయిన్లను తమ బ్యానర్‌లో పూర్తిగా లాక్ చేసేసింది. వారే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna).
కృతి సనన్, మడాక్ ఫిల్మ్స్ అధినేత దినేష్ విజన్ మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. 2017లో వచ్చిన 'రాబ్తా' సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ, కృతి సనన్‌లోని ప్రతిభను నమ్మి మడాక్ ఫిల్మ్స్ ఆమెను అస్సలు వదిలిపెట్టలేదు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు ఇస్తూ ఆమె కెరీర్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఇప్పటికే 6 సినిమాలు వచ్చాయంటే వీరి బాండింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరి కాంబోలో రాబోయే సినిమాలలో కూడా కృతినే ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్‌గా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'కాక్ టైల్ 2' జూన్ 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
మరోవైపు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన నేషనల్ క్రష్ రష్మిక సైతం ఈ బడా నిర్మాణ సంస్థతో చాలా తక్కువ సమయంలోనే గట్టి ఫ్రెండ్‌షిప్ బిల్ట్ చేసుకుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన హిస్టారికల్ డ్రామా 'ఛావా' సినిమాతో రష్మికకు ఈ బ్యానర్‌తో అడుగు పడింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో రష్మిక ఈ ప్రొడక్షన్‌కు లక్కీ చార్మ్‌లా మారిపోయింది. ఆ తర్వాత వెంటనే వీరి కాంబోలో వచ్చిన హారర్ కామెడీ 'థమా' మూవీ కూడా ఓకే టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఊపుతో మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న క్రేజీ సీక్వెల్ 'కాక్ టైల్ 2'లో కూడా రష్మిక కీలక పాత్రలో మెరవబోతోంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి మడాక్ బ్యానర్‌కు పర్మనెంట్ లక్కీ హీరోయిన్ అయిపోవాలని రష్మిక గట్టి ప్లాన్ వేస్తోంది.
ఈ బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్‌తో రష్మికకు ఉన్న రిలేషన్స్ కేవలం ఆమె వరకే పరిమితం కాలేదు. ఈ కొలాబరేషన్‌ను మరింత పెద్దది చేసేందుకు రష్మిక తన భర్త, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను కూడా రంగంలోకి దించినట్లు ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవలే విజయ్ దేవరకొండ ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో కలిసి ముంబైలోని మడాక్ ఫిల్మ్స్ ఆఫీస్‌కు వెళ్లడం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సంచలనం సృష్టించింది. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ కాబోతోందని సమాచారం. ఇలా ఒకే బ్యానర్‌లో అటు కృతి సనన్, ఇటు రష్మికలను లాక్ చేయడమే కాకుండా, సౌత్ స్టార్ హీరోలతో కూడా భారీ ప్రాజెక్టులు లైన్లో పెడుతూ మడాక్ ఫిల్మ్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పవర్‌ఫుల్ బ్యానర్‌గా అవతరిస్తోంది.
![]() |
![]() |