![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'(Fauzi)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ మినహా ఇప్పటివరకు ఎలాంటి మేజర్ అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తోంది. దీంతో అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్, ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను 'ఫౌజీ' వైపు మళ్లించినట్టు తెలుస్తోంది. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెబల్ స్టార్ ఏకంగా బల్క్ డేట్స్ కేటాయించారని సమాచారం. ప్రభాస్ ఒకేసారి భారీగా డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ శరవేగంగా దూసుకుపోనుంది. అంతేకాదు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం వచ్చే నెలలోనే 'ఫౌజీ' టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్‌తోనే సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయబోతున్నారట.
నిజానికి 'ఫౌజీ' సినిమా వచ్చే దసరా కానుకగా థియేటర్లలోకి రానుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను డిసెంబర్ నెలలో అత్యంత భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ సినిమాను డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో భారీ రేటుకు డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయిన వెంటనే డిసెంబర్ 3 రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే ఒక పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇమాన్వి, ఈ సినిమాతో వెండితెరపై ప్రభాస్ పక్కన ఎలా అలరించబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో క్యూరియస్‌గా ఉన్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్ తో పాటు ప్రభాస్ రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ 'ఫౌజీ' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఏదేమైనా వచ్చే నెల టీజర్ అప్‌డేట్ తో రెబల్ ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
![]() |
![]() |