![]() |
![]() |

ఒకే ఒక్క వీడియో ఇప్పుడు తమిళ సినీ, పొలిటికల్ సర్కిల్స్ తో పాటు ఇండియన్ సినీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అదే తమిళనాడు ఎన్నికల సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)ఓటు హక్కు వినియోగించుకున్న వీడియో. హాట్ టాపిక్ గా మారడానికి గల కారణం అందరకి తెలిసిన విషయమే. మరి ఆ డీటెయిల్స్ మరో సారి చూద్దాం.
రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి ఉదయాన్నే చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో ఉన్న పోలింగ్ కేంద్రానికి చేరుకొని క్యూలో నిలబడి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం వేలికి ఉన్న సిరా చుక్కని మీడియాకి చూపిస్తూ చిరునవ్వులు చిందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత, అందరూ వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది.
ఎప్పట్నుంచో రజినికాంత్ తన ఓటుని తన సినిమా పర్సన్ విజయ్(VIjay)కి ఓటు వేస్తాడా అనే చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు బూత్ లో రజినీని చూసిన తర్వాత ఆ చర్చలు పతాక స్థాయికి వెళ్లాయి. విజయ్ ,రజనీకాంత్ మధ్య అయితే మంచి స్నేహం ఉంది. చాలా సినిమాల్లో రజినీ స్టైల్ ని ఫాలో అవ్వడంతో పాటు రజనీ అభిమానిని అని కూడా చాలా సందర్భాల్లో విజయ్ చెప్పుకొచ్చాడు.
Also read: Vtv Ganesh: ఏ పార్టీకి ఓటు వేశాడో చెప్పిన విటివి గణేష్.. ఆ హీరో ఫ్యాన్స్ కి షాక్
కేవలం రజనీకాంత్ మాత్రమే కాకుండా, కోలీవుడ్ సినీ ప్రముఖులంతా తమకి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. త్రిష, ధనుష్, శివకార్తికేయన్ వంటి తారలు ఓటు వేయడానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. త్రిష ఓటు వెయ్యడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
![]() |
![]() |