![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ (Venkatesh), డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడి మార్పు జరిగినట్లు సమాచారం. (Aadarsha Kutumbam House No 47)
హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తమన్?
మొదట ఈ సినిమాను ప్రకటించినప్పుడు ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తారని మూవీ టీమ్ తెలిపింది. అయితే, అనివార్య కారణాల వల్ల హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ రంగంలోకి దిగినట్లు సమాచారం.
త్రివిక్రమ్ - తమన్ సక్సెస్‌ఫుల్ కాంబో:
త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత', ‘అల వైకుంఠపురములో’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్ సాధించాయి. వీరిద్దరి మధ్య ఉన్న మంచి సింక్ వల్ల, త్రివిక్రమ్ తన కొత్త సినిమాకి కూడా తమన్‌నే ఎంచుకున్నట్లు టాక్. ఇప్పటికే తమన్ ఈ సినిమా కోసం ట్యూన్స్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు న్యూస్ వినిపిస్తోంది.
![]() |
![]() |