Home  »  News  »  Balayya Puri: బాలయ్య, పూరి కాంబోలో మరో మూవీ!

Updated : Feb 23, 2026

'పైసా వసూల్' కాంబినేషన్ రిపీట్!
తొమ్మిదేళ్ళ తరువాత చేతులు కలుపుతున్న బాలయ్య, పూరి!
బాలకృష్ణ కోసం పూరి ఎలాంటి కథ రాస్తున్నాడు?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'పైసా వసూల్'. 2017లో విడుదలైన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో బాలకృష్ణ డైలాగ్ డెలివరీకి, ఆయనను పూరి చూపించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పైగా చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ బాలయ్య-పూరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో వీరి కాంబోలో సెకండ్ ఫిల్మ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వారి ఎదురుచూపులు ఫలించనున్నాయని తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా 'స్లమ్‌డాగ్' అనే సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Slumdog – 33 Temple Road)

'స్లమ్‌డాగ్' తరువాత పూరి తన తదుపరి సినిమాని బాలకృష్ణతో చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారట. పూరితో మరో సినిమా చేయడానికి రెడీ అని గతంలోనే బాలయ్య చెప్పారు. కావున పూరి ఒక మంచి కథతో వెళ్తే.. బాలకృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే అవకాశముంది.

అయితే బాలకృష్ణ చేతిలో ఇతర ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ప్రస్తుతం తన 111వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తరువాత అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ పూరి ప్రాజెక్ట్ ఫైనల్ అయితే ఇది బాలకృష్ణకు 112 లేదా 113వ సినిమా అవుతుందేమో చూడాలి. (NBK 111)

Also Read: నాగచైతన్య 25వ సినిమా.. రాజమౌళి కాదు.. రంగంలోకి సుకుమార్! 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.