Home  »  News  »  Pawan kalyan: ఎందుకు కలిసారు..ఆరా ఆఫ్ ఉస్తాద్ రికార్డ్స్ కొడుతుందా!

Updated : Feb 23, 2026

 

-నిన్న రిలీజైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్  
-రికార్డు వ్యూస్ వశం
-పవన్ కళ్యాణ్ ని అల్లు అరవింద్ ఎందుకు కలిసాడు 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat singh)నుంచి నిన్న 'ఆరా ఆఫ్ ఉస్తాద్' (Aura Of  ustaad)సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. అలా రిలీజ్ అయ్యిందో లేదో యూట్యూబ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు నమోదు చేసే దిశలో చాలా సుస్పష్టంగా దూసుకెళ్తుంది. దీంతో సోషల్ మీడియాలో పవన్ మానియా ఒక రేంజ్ లోనే సాగుతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా అల్లు అరవింద్(Allu Aravind)దంపతులు, అల్లు శిరీష్ లతో ఉన్న పవన్  పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు విషయమేంటో చూసేద్దాం.
 
మార్చి 6 న అల్లు శిరీష్(Allu Sirish),నైనికా రెడ్డి(Nainika Reddy)ల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని అల్లు అరవింద్ దంపతులతో పాటు అల్లు శిరీష్ కలిసి పెళ్లి కార్డుని అందచేశారు. పవన్ కళ్యాణ్ కూడా సతీసమేతంగా పెళ్లి కార్డుని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో ఎక్స్ క్లూజివ్ గా తెరపైకి వచ్చి వైరల్ స్టేజ్ లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. నాగబాబు(Nagababu)దంపతులని కూడా అల్లు అరవింద్ దంపతులు కలిసి పెళ్లి కార్డు అందించారు.

also read: Jana nayagan: రిలీజ్ డేట్ మరింత వెనక్కి!..కానీ ఆ డేట్ స్పెషల్ ఇదే 

మంగళగిరి వేదికగా జరిగిన ఈ తతంగం మొత్తంతో అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య అల్లుకొని ఉన్న ఆప్యాయతని మరోసారి తెలియచేసింది.   

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.