Home  »  News  »  Jana Nayagan: రిలీజ్ డేట్ మరింత వెనక్కి!..కానీ ఆ డేట్ స్పెషల్ ఇదే 

Updated : Feb 23, 2026


-సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొత్త డేట్ 
-ఆ డేట్ నిజమేనా!
-అసలు ఇంకా ఎందుకు లేటు


ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులకి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు అనే వర్డ్ సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో చాలా రోజుల నుంచి చక్కర్లు కొడుతు ఉంది. ఇందుకు మూలకారణంగా నిలిచిన జననాయగన్(Jana Nayagan)మాత్రం తన రిలీజ్ డేట్ విషయంలో స్పష్టమైన భరోసాని ఇప్పటికి  కల్పించలేకపోతుంది.సెన్సార్ సూచించిన కట్స్ కి చిత్ర బృందం ఒప్పుకుందని, దీంతో ఈ నెలలోనే రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు భావించారు. కానీ రిలీజ్ డేట్ మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే న్యూస్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇష్టారీతిలో చక్కర్లు కొడుతుంది. మరి తను ఏం చెప్తుందో చూద్దాం.

జన నాయగన్ రిలీజ్ పై  మద్రాస్ హైకోర్ట్ నియమించిన రివ్యూ కమిటీ ఇంకా తమ రిపోర్ట్ ని సబ్మిట్ చెయ్యలేదు. దీంతో ఈ నెలలో రిలీజ్ అనేది అసంభవం. ఎప్పుడు తన రిపోర్ట్ ని అందిస్తుందో కూడా తెలియని పరిస్థితి. అసలు ఈ విషయంపై సెన్సార్ స్పందిస్తున్న దాఖలాలు లేవు. కోర్టుతో ముడిపడిన విషయం కాబట్టి తీర్పు రావడానికి టైం పట్టేలా ఉంది. సదరు తీర్పు ఎప్పుడు వచ్చినా  విజయ్ బర్త్ డే రోజైన జూన్ 22 న  రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా సోషల్ మీడియా ఫ్రెష్ టాక్. 

also read:  నరేష్, పవిత్ర బంధంపై కొడుకు కీలక వ్యాఖ్యలు 


జననాయగన్ ని విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో కేవిఎన్ ప్రొడక్షన్స్ పై (Kvn Productions)పై వెంకట్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. విజయ్ తో పాటు పూజాహెగ్డే, మమిత బైజు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. భగవంత్ కేసరి రీమేక్ అనే టాక్ యధావిధిగా కంటిన్యూ అవుతున్న జననాయగన్ ని హెచ్ వినోద్(H. Vinoth)తెరకెక్కించాడు. మూడు నుంచి ఐదు వందల కోట్ల బడ్జెట్.మరి అభిమానులు, మూవీ లవర్స్ కి మోక్షం కలిగేది ఎప్పుడో చూడాలి.    



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.