![]() |
![]() |

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ కి 'మంచు మనోజ్'(Manchu Manoj)రూపంలో సరికొత్త ప్రతి నాయకుడు దొరికిన విషయం తెలిసిందే. 'మిరాయ్'(Mirai)సక్సెస్ రేంజ్ పెరగడానికి మనోజ్ విలనిజం కూడా ప్రధాన కారణం. దీన్ని బట్టి మనోజ్ నట విశ్వరూపం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. హీరోగా సత్తా చాటిన మనోజ్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లోకి మారడం ఏంటని కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పడు వాళ్లే మనోజ్ ప్రతి నాయకుడుగా నెక్స్ట్ చిత్రం ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అసలు మనోజ్ ని ప్రతినాయకుడిగా మారమని ఎవరైనా చెప్పారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది.
రీసెంట్ గా 'మంచు మనోజ్' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారిని నేను చాలా సార్లు కలిసాను. అలా కలిసినప్పుడల్లా ఆయన నాతో మాట్లాడుతు మనోజ్ నువ్వు నెగిటివ్ రోల్ లో చేస్తే చూడాలని ఉంది. నువ్వు విలన్ గా మారితే మాములుగా ఉండదు. బిజీ అవుతావని చెప్పారని మనోజ్ వెల్లడి చేసాడు. సుదీర్ఘ కాలం నుంచి పవన్, మనోజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్నీ ఇద్దరు చాలా సార్లు బహిరంగంగానే చెప్పారు. మా ఎలక్షన్స్ టైంలో మనోజ్, పవన్ ల అనుబంధానికి సంబంధించిన వీడియో వైరల్ గాను మారింది.

![]() |
![]() |