![]() |
![]() |

హైదరాబాద్ లో ఒక యాడ్ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగి, గాయాల పాలైనట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. (Jr NTR Injured)
"ఈరోజు ఒక యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు స్వల్ప గాయానికి గురయ్యారు. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికి ఆయన రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. అభిమానులు, మీడియా, ప్రజలందరూ ఎలాంటి ఊహాగానాలకు లోనుకాకుండా సహకరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాం." అని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

ఎన్టీఆర్ గతంలో కూడా పలు సినిమాల షూటింగ్స్ సమయంలో గాయపడ్డారు. అలాగే 2009 ఎన్నికల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. దానిని అభిమానులు ఎంత తేలికగా మరిచిపోలేరు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కి ప్రమాదం అనే వార్త వినగానే.. అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే అది ఆందోళన చెందాల్సినంత పెద్ద ప్రమాదం కాదని, ఆయనకు స్వల్ప గాయమే అయిందని.. ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ప్రకటన రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
![]() |
![]() |