![]() |
![]() |

స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఆయనకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు వినికిడి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. (Jr NTR injured)
ఎన్టీఆర్ గతంలో కూడా పలు సినిమాల షూటింగ్స్ సమయంలో గాయపడ్డారు. అలాగే 2009 ఎన్నికల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. దానిని అభిమానులు ఎంత తేలికగా మరిచిపోలేరు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కి ప్రమాదం అనే వార్త వినగానే.. అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే అది ఆందోళన చెందాల్సినంత పెద్ద ప్రమాదం కాదని, ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారని న్యూస్ వినిపిస్తోంది.
![]() |
![]() |