![]() |
![]() |

సుదీర్ఘ కాలంగా అభిమానులని,ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తు ఒక హీరో వంద చిత్రాలు పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని కనపరుస్తూ,
కొత్తదనంతో కూడిన కథల్లో నటించడమంటే కత్తి మీద సామే. ఈ విషయంలో తన మార్క్ హీరోయిజాన్ని ప్రదర్శించే వాళ్ళల్లో 'కింగ్ నాగార్జున'(Nagarjuna)ఒకరు. సోలో హీరోగా సత్తా చాటుతునే , ఎలాంటి బేషజాలకి పోకుండా,ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించి, తన హవా చాటడం 'నాగార్జున'కి మాత్రమే సాధ్యమయ్యే స్టైల్.
నాగార్జున హీరోగా 'నా సామిరంగ' తో తొంబై తమ్మిది చిత్రాలని పూర్తి చేసాడు. దీంతో నాగార్జున వందవ చిత్రం ఎలా ఉండబోతోందనే ఆసక్తి, అభిమానులతో పాటు ప్రేక్షకులో ఉంది. అందుకు తగ్గట్టే నాగార్జున వందవ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళ దర్శకుడు 'కార్తీక్' దర్శకత్వం వహిస్తున్నాడు. రెగ్యులర్ కధాంశంతో కాకుండా, పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)'కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. దీంతో చిరంజీవి ఎలాంటి రోల్ లో కనిపిస్తాడు, నాగార్జున, చిరంజీవి స్క్రీన్ ఫెయిర్ ఎలా ఉండబోతుందనే చర్చ ఇద్దరి అభిమానుల్లో జరుగుతుంది. ఈ రూమర్ నిజం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. చిరంజీవి, నాగార్జున మంచి మిత్రులతో పాటు చిరంజీవిని నాగార్జున అన్నయ్య అని పిలుస్తాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన 'కుబేర' ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున హీరోగానే కాకుండా ప్రేక్షకుల మనస్సులో చిరకాలం నిలిచిపోయే వైవిద్యమైన పాత్రలని చేస్తున్నాడు.
ఈ విషయంలో నాగార్జున ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, నేను కూడా అలాంటి పాత్రలు చెయ్యడానికి రెడీ అని చెప్పాడు. ఈ నేపథ్యంలో నాగార్జున వందవ చిత్రంలో చిరంజీవి కనపడ్డా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, స్క్రీన్ పై కూడా నాగార్జునకి ఫ్రెండ్ క్యారక్టర్ లో కనిపించవచ్చనే మాటలు వినపడుతున్నాయి. నాగ చైతన్య(Nagachaitanya),అఖిల్(Akhil)కూడా కనిపించబోతున్నారని తెలుస్తుంది. విజయదశమి(Vijaya Dasami)కానుకగా ఈ చిత్రం ప్రారంభమవుతుందని టాక్ . చిరంజీవి గతంలో మహా నటుడు 'అక్కినేని నాగేశ్వరరావు'(ANR)గారితో కలిసి 'మెకానిక్ అల్లుడు' చేసిన విషయం తెలిసిందే.
![]() |
![]() |