![]() |
![]() |

అగ్ర హీరో 'శత్రుఘ్నసిన్హా'(Shatrughan sinha)నటవారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసి బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న నటి 'సోనాక్షి సిన్హా'(Sonakshi sinha).2010 లో సల్మాన్ హిట్ మూవీ 'దబాంగ్' తో కెరీర్ ని ప్రారంభించి, అద్భుతమైన పెర్ఫార్మెన్సు ని ప్రదర్శించే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ కూడా పొందిన మీనాక్షి, రీసెంట్ గా గత 'జులై' లో టైటిల్ రోల్ లో 'నిఖితా రాయ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఎంతో మంది హీరోయిన్స్ లో 'సోనాక్షిసిన్హా' కూడా ఒకరు. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ నోట్ ని రాసుకొచ్చింది. సదరు నోట్ లో 'నేను ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటాను. కొన్ని బ్రాండెడ్ వెబ్ సైట్స్ లలో నా ఫోటోలు చూసి షాకయ్యను. నా అనుమతి లేకుండా ఎలా ఉపయీగించుకుంటారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక నటిగా నేను అనేక దుస్తులు, ఆభరణాలు ధరిస్తు ఉంటాను. దాంతో ఆ డ్రెస్ వివరాలు దాని బ్రాండ్ కి క్రెడిట్ ఇస్తు ఇనిస్టాగ్రమ్ లో పోస్ట్ చేస్తాను. అంత మాత్రాన నా చిత్రాలు మీ వెబ్ సైట్ కి ఉపయోగించుకుంటారా. మీ గురించి నేను బహిరంగంగా చెప్పకముందే నా చిత్రాలని తిలగించండని సోనాక్షి ఇన్ స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చింది. గతంలోను కొంత మంది హీరోయిన్స్ కి ఇలాగే జరిగింది.
ఓ మై గాడ్, సన్ ఆఫ్ సర్దార్, హిమ్మత్ వాలా, దబాంగ్ 2 , యాక్షన్ జాక్సన్, బడే మియాన్, చోటే మియాన్ , కాకుడా, ఫోర్స్ 2 , వెల్కమ్ టూ న్యూయార్క్, దబాంగ్ 3 , డబుల్ ఎక్స్ ఎల్, ఇలా సుమారు ముప్పై చిత్రాల వరకు సోనాక్షి వివిధ పాత్రలు చేసి అభిమానులని అలరించింది. వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుతు గత ఏడాది 'హీరామండీ' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
![]() |
![]() |