![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'ఓజి'(Og)రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ మొదలైంది. విజయదశమి(Vijayadasami)కానుకగా వచ్చే నెల 25 న పవన్ కెరీర్ లోనే వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ కూడా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా 'సువ్విసువ్వి' అనే రొమాంటిక్ లిరిక్స్ తో కూడిన సాంగ్ ని రిలీజ్ చేయగా, రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.
పవన్ గత నెల జులైలో 'హరిహర వీరమల్లుతో' డిజాస్టర్ ని అందుకున్నాడు. పైగా పవన్ రేంజ్ కి తగ్గ వసూళ్లు రాలేదు.యుఎస్(us)లో సైతం అదే పరిస్థితి. కానీ ఆ ప్రభావం 'ఓజి'పై కనిపించడం లేదు. యు ఎస్ లో 'ఓజి' ఒక రోజు ముందుగానే సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. ఈ మేరకు రెండు రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. పవన్ కెరీర్ లోనే ఫస్ట్ టైం అత్యంత వేగంగా 5 లక్షల డాలర్ల ప్రీమియర్ సేల్స్ ని రాబట్టిన మూవీగా ఓజి నిలిచింది. టైటిల్ సాంగ్ లోని 'క్షణక్షణమొక తల తెగి పడెలే' అనే క్యాప్షన్ తో 'ఓజి' టీం అధికారకంగా ప్రీమియర్ సేల్స్ రికార్డు విషయాన్నీ వెల్లడి చేసింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ రేంజ్ ఇది కదా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ ఫేమ్ దానయ్య(Dvv Danayya)తన కుమారుడు దాసరి కళ్యాణ్(Dasari Kalyan)తో కలిసి 'ఓజి' ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన కన్మణి అనే క్యారక్టర్ లో ప్రియాంక మోహన్ చేస్తుంది. ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ టైం విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీయ రెడ్డి, సిరి, ప్రకాష్ రాజ్, షాన్ కక్కర్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డిజె టిల్లు ఫేమ్ 'నేహాశెట్టి' స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానున్న 'ఓజి' ని సాహో ఫేమ్ సుజిత్(Sujeeth)ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించగా థమన్(Thaman)మ్యూజిక్ ని అందించాడు. 200 కోట్ల రూపాయిల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉందనే టాక్ వినపడుతుంది.

![]() |
![]() |