![]() |
![]() |

సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత' ప్రముఖ నిర్మాత 'నాగవంశీ'(Naga Vamsi)కి సినీ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. తన కొత్త చిత్రాల రిలీజ్ టైంలో మీడియా సమక్షంగా నాగవంశీ వేసే ప్రశ్నలు, చెప్పే సమాధానాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో నాగవంశీ కి పెద్ద ఫాలోయింగ్ ఉంది. ట్రోల్ల్స్ కూడా ఒక రేంజ్ లోనే జరుగుతుంటాయి.
రీసెంట్ గా సోషల్ మీడియాలో నాగవంశీ పై మరో ట్రోల్ జరుగుతుంది. 'వార్ 2 ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ మాట్లాడుతు 'వార్ 2’(War 2)ని హిట్ చేసే బాధ్యత ఎన్టీఆర్ అభిమానులదే. ఫస్ట్ డే హిందీ కంటే తెలుగులో ఒక్క రూపాయైనా ఎక్కువ వచ్చేలా చేయాలని మాట్లాడాడు. కానీ వార్ 2 కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో గతంలో పుష్ప 2 రిలీజ్ టైంలో ఒక ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతు నార్త్‌లో పుష్ప 2 ఒకే రోజు 80 కోట్లు వసూలు చేస్తే బాలీవుడ్ నిద్రపోదని చెప్పాడు. ఇప్పుడు బాలీవుడ్ నుండి వచ్చిన వార్ 2కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు లేకపోవడంతో, నెటిజన్లు పుష్ప నాటి మాటలను గుర్తు చేస్తు వార్ 2కి కలెక్షన్లు రావడం లేదు కదా నీకు నిద్ర పడుతుందా అన్నా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్(Ntr),హృతిక్(Hrithik Roshan)ల 'వార్ 2 'ని 'నాగవంశీ' తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసాడు. సదరు హక్కులని 80 కోట్ల రూపాయలకి దక్కించుకున్నట్టు సినీ సర్కిల్స్ లో టాక్.
లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ తో వరుస విజయాల్ని అందుకున్న నాగవంశీ రీసెంట్ గా 'విజయ్ దేవరకొండ' తో నిర్మించిన 'కింగ్ డమ్'(Kingdom)తో ప్లాప్ ని అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజతో చేసిన ‘మాస్ జాతర’(Mass Jathara)ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |