![]() |
![]() |

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం.. యుగపురుషుడు..మాజీ ముఖ్యమంత్రి.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి తారకరరామారావు'(Ntr).ఆయన కుటుంబసభ్యులని అభిమానులతో పాటు తెలుగు వాళ్లంతా తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు.
ఈ రోజు తెల్లవారు జామున 'ఎన్టీఆర్' పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ భార్య 'పద్మజ'(Padmaja)మృతి చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెని హాస్పిటల్ లో చేర్పించారు. చివరకి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పద్మజ గారి మరణ వార్తతో విజయవాడ నుండి ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నుండి శ్రీమతి పురందేశ్వరి పద్మజ గారి పార్థివ దేహాన్ని సందర్శించడానికి వస్తున్నారు.మిగతా ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది.
నందమూరి జయకృష్ణ,పద్మజ గార్ల కొడుకు పేరు 'చైతన్య కృష్ణ'. హీరోగా పలు చిత్రాలు చేసాడు. గత ఏడాది 'బ్రీత్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా జయకృష్ణ నే ఆ చిత్రాన్ని నిర్మించాడు.

![]() |
![]() |