![]() |
![]() |

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)ఈ నెల 14 న పాన్ ఇండియా మూవీ 'కూలీ'(Coolie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేవ అనే క్యారక్టర్ లో విజృంభించి నటించడంతో, టాక్ తో సంబంధం లేకుండా, అన్ని ఏరియాల్లో కూలీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ ని రాబట్టగా, ఇండియా వైడ్ గా 350 కోట్లు గ్రాస్ ని రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
రీసెంట్ గా తెలంగాణ ఆర్టీసీ ఎండీ 'వీసీ సజ్జనార్'(Vc Sajjanar)ఎక్స్(X)వేదికగా రజనీ గురించి ప్రస్తావిస్తు 'మీరు రియల్ సూపర్ స్టార్ రజనీ గారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటు కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు. డబ్బుకి కక్కుర్తి పడుతు బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలని ప్రమోట్ చేస్తు, ఎంతో మంది జీవితాలని నాశనం చేస్తున్నారు. కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం. మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయకూడదనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఆ నిర్ణయం అభినందనీయం. మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటుపోయినా, మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రటీలు రజనీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థల ప్రమోషన్లకు దూరంగా ఉండాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి. మనదేశంలో ఏ వాణిజ్య ప్రకటనల్లోని నటించని ఏకైక స్టార్ హీరో రజనీ కాంత్ అని సదరు ట్వీట్ లో రాసుకొచ్చారు.
రజనీ ఇప్పటి వరకు రెండు కార్యక్రమాలకి మాత్రం ప్రకటన ఇచ్చాడు. ఒకటి తమిళనాడు ప్రభుత్వం 1980ల్లో ప్రారంభించిన పల్స్ పోలియో కాగా, నేత్రదానం కోసం మరో ప్రకటనలో కనిపించాడు.
రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉచితంగానే ఆ కార్యక్రమాల్ని చేసాడు.
![]() |
![]() |