![]() |
![]() |

కింగ్ 'నాగార్జున'(Nagarjuna)ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth)తో కలిసి చేసిన 'కూలీ'తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. తన ఎంటైర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్ ఉన్న 'సైమన్' క్యారక్టర్ లో కొత్త తరహా విలనిజాన్ని ప్రదర్శించాడు. రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ గా ఓటిటితో పాటు ప్రముఖ ఛానల్ లో ప్రారంభమైన 'జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa)అనే టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కి నాగార్జున గెస్ట్ గా రావడం జరిగింది.
ఈ షో లో నాగార్జున తన సినీ జర్నీ గురించి మాట్లాడుతు కెరీర్ తొలినాళ్లలో నా సినిమాల్ని'నాగేశ్వరరావు గారి అబ్బాయి'ని అనే ఉదేశ్యంతో చూసారు. దాంతో కొంత మందికి నా నటన నచ్చింది. మరికొంత మందికి నచ్చలేదు. చాలా సినిమాల తర్వాత 'మజ్ను'తో నాలో కూడా ఒక నటుడు ఉన్నాడని గుర్తించారు. కమర్షియల్ చిత్రాల్లో ఆఖరిపోరాటం మంచి విజయాన్ని ఇచ్చింది. కానీ ఆ క్రెడిట్ రాఘవేంద్రరావు(K. Raghavendra Rao) శ్రీదేవి(Sridevi)ది. ఆ చిత్రంలో నేనొక బొమ్మని. దీంతో నాకు నచ్చిన విధంగా సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. 'మణిరత్నం' దర్శకత్వంలో వచ్చిన 'మౌనరాగం' ఎంతగానో నచ్చింది. ఆయన తెరకెక్కించే సున్నితమైన సబ్జెట్స్ కి నేను సరిపోతానని భావించి, మణిరత్నం(Mani ratnam)గారు వాకింగ్ చేసే పార్క్ అడ్రస్ తెలుసుకున్నాను. నెలరోజుల పాటు ఆయన వెంట పడి 'గీతాంజలి' మూవీని ఒప్పించాను. గీతాంజలిని మొదట తమిళంలో తెరకెక్కిద్దామని అనుకున్నారు. కానీ తెలుగులో తెరకెక్కించి మార్కెట్ ని పెంచుకోండని మణిరత్నం గారికి సలహా ఇచ్చానని నాగార్జున 'షో' లో చెప్పుకొచ్చాడు.
'గీతాంజలి'(Geethanjali)1989 మే 19 న విడుదలై నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడంతో పాటు, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఏ క్యారక్టర్ నైనా అవలీలగా పోషించగల హీరోగా నాగార్జునకి మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడుగా మారాడు. హైదరాబాద్ దేవి థియేటర్ తో పాటు పలు కేంద్రాల్లో వంద రోజుల్ని జరుపుకుంది. నాగార్జున సరసన గిరిజ(Girija)జతకట్టగా,నరసారెడ్డి నిర్మించాడు. మణిరత్నంకి ఇదే మొదటి తెలుగు సినిమా. సాంగ్స్ నేటికీ మారుమోగిపోతుంటాయి.

![]() |
![]() |