![]() |
![]() |
కేరాఫ్ కంచరపాలెం వంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడుగా పరిచయమైన వెంకటేష్ మహా తొలి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సత్యదేవ్ ప్రధాన పాత్రలో మరో విభిన్నం చిత్రంగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వచ్చింది. అయితే ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. దాదాపు 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘రావు బహదూర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వెంకటేష్. ఈ సినిమాలో కూడా సత్యదేవ్‌నే హీరోగా తీసుకున్నారు. జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ బేనర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ అందర్నీ ఆకట్టుకుంది. సత్యదేవ్‌ని గుర్తుపట్టలేని విధంగా అతని గెటప్‌ని క్రియేట్ చేశారు వెంకటేష్.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఏ జోనర్ సినిమా అనేది కూడా అర్థం కాని విధంగా టీజర్ ఉంది. ఈ టీజర్‌ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. ఈ టీజర్‌లో మొదట వినిపించే డైలాగ్ నాకు అనుమానం అనే భూతం పట్టిందంటూ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ఇది ఒక సైకలాజికల్ డ్రామా అనే విషయం టీజర్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో సత్యదేవ్ రకరకాల గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో మర్డర్స్ మిస్టరీ కూడా ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించేలా కనిపిస్తోంది. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌నివ్వాలనే ఆలోచనతో వెంకటేష్ మహా చేసిన ‘రావు బహదూర్’ సత్యదేవ్ కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీ కాబోతోంది.
![]() |
![]() |