![]() |
![]() |

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)కింగ్ 'అక్కినేని నాగార్జున'(Akkineni Nagarjuna),హిట్ చిత్రాల దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'కూలీ'(Coolie). యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. బాలీవుడ్ అగ్ర హీరో 'అమీర్ ఖాన్'(Aamir Khan)గెస్ట్ రోల్ లో కనిపిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra)కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా తెలుగు రిలీజ్ కి సంబంధించి చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో నాగార్జున, శృతిహాసన్(Shruthi Haasan),లోకేష్ కనగరాజ్ పాల్గొని 'కూలీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నారు.
రజినీకాంత్ మాత్రం తన సందేశాన్ని వీడియో రూపంలో పంచుకోవడం జరిగింది. సదరు వీడియోలో రజనీ మాట్లాడుతు ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది. అలాంటి సమయంలో 'కూలీ' రిలీజ్ కాబోతుంది. తెలుగులో రాజమౌళి చేసిన సినిమాలన్నీ ఎలా అయితే సూపర్ హిట్ గా నిలిచాయో, లోకేష్ కనగరాజ్ తమిళ్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్. ఈ మూవీలో విలన్ క్యారక్టర్ చాలా పవర్ ఫుల్. విలన్ గా ఎవరు చేస్తారా అని అనుకున్నాను. కథ విన్నప్పుడు నేనే విలన్ గా చేయాలనీ అనుకున్నాను. అంత పవర్ ఫుల్ క్యారక్టర్. లోకేష్ వచ్చి నాగార్జున చేస్తున్నారని చెప్పగానే షాక్ అయ్యాను. కింగ్ నాగార్జున విలన్ గా చేస్తుండటం పెద్ద సర్ ప్రైజ్.విలన్ గా అదరగొట్టేశాడు. నేను కూడా ఇలా చేయలేను అనిపించింది.
భాషా మూవీలోని విలన్ ఆంటోని క్యారక్టర్ ఎలా అయితే గుర్తిండిపోయిందో, కూలీలోని 'సైమన్' కూడా అలాగే గుర్తిండిపోతుంది. డబ్బు కోసం విలన్ గా చెయ్యాల్సిన అవసరం నాగార్జునకి లేదు. వెరైటీ క్యారెక్టర్స్ ని చెయ్యాలనుకొని విలన్ గా చేసారు. ముప్పై మూడేళ్ళ క్రితం నాగార్జునతో ఒక మూవీ చేశాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఆయన గ్లామర్, ఫిట్ నెస్ చూసి ఇలా ఎలా ఉండగలరు అని అడిగితే, వర్కౌట్స్ తో పాటు స్విమింగ్, మా నాన్న గారి జీన్స్, ఏదీ మనసులోకి తీసుకోకపోవడమని చెప్పారు. నాగార్జున గారు నేను కలిసి పదిహేను రోజులు షూటింగ్ చేసాం. ఆయనతో గడిపిన రోజులను లైఫ్ లో మర్చిపోలేనని రజనీ సదరు వీడియోలో చెప్పడం జరిగింది. శ్రుతిహాసన్ హీరోయిన్ కాగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించడం జరిగింది. పూజాహెగ్డే ప్రత్యేక సాంగ్ లో మెరిసింది.
![]() |
![]() |