![]() |
![]() |
ఆగస్ట్ నెలలో విడుదలవుతున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కూలీ’కి ఒక డిఫరెంట్ హైప్ క్రియేట్ అయింది. ఆగస్ట్ 14న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. లోకేష్ కనగరాజ్ సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అతని టేకింగ్ అంటే అందరూ ఇష్టపడతారు. రజినీకాంత్, లోకేష్ కాంబినేషన్‌లో సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచే విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకులు రజినీ అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్‌లో సినిమా చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే ట్రైలర్ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేసింది. రజినీకాంత్ ఇమేజ్‌కి తగ్గట్టుగా సినిమా ఉంటూనే లోకేష్ స్టైల్‌లో ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని ట్రైలర్‌లోనే అర్థమైంది.
‘అడుగు పెడితె విజిల్ మోగులే..’ అంటూ ట్రైలర్ మొత్తం ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉంది. రజినీకాంత్ ఎంట్రీ, నాగార్జున క్యారెక్టర్‌లోని నెగెటివ్ షేడ్స్, ఉపేంద్ర క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్, అన్నింటినీ మించి ఆమిర్‌ఖాన్ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించాడు అనేది చూపించీ చూపించనట్టుగా ట్రైలర్‌లో విజువల్స్ కట్ చేశారు. సినిమాలో ఏదో ఉంది అనే క్యూరియాసిటీ ట్రైలర్ చూస్తుంటే కలుగుతోంది. అలాగే శ్రుతిహాసన్, సత్యరాజ్‌ల క్యారెక్టర్ల వెనుక కూడా పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. ‘కేవలం ఈ నెట్‌వర్క్‌తో వీళ్లింత గొప్పోళ్లు అయ్యారని నేననుకోవడం లేదు సర్. ఎవరికీ తెలీకుండా ఇకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ..’ అనే డైలాగ్ కూడా సినిమా గురించి చెప్పినట్టుగానే ఉంది. ట్రైలర్ చూపించిందే కాకుండా సినిమాలో ఇంకా ఏదో ఉందనే ఫీలింగ్ ఆడియన్స్‌కి కలిగించాడు డైరెక్టర్.
సినిమా అంతా రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ కీలకంగా ఉండే అవకాశం ఉంది. ట్రైలర్‌లో వినిపించిన అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వినిపించే పాట కూడా కొత్తగా అనిపించాయి. ‘30 సంవత్సరాల నుంచి ఒకడ్ని ఆఫ్‌లైన్‌లోనే ఉంచాను. వాడికి విషయం తెలిస్తే..’ అనే డైలాగ్ వచ్చిన వెంటనే ‘అడుగు పెడితే విజిల్ మోగులే..’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే సాంగ్ సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో తెలియజేస్తోంది. అదే సమయంలో ట్రైలర్‌లో కనిపించిన క్యారెక్టర్ల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనేది కూడా అర్థం కాకుండా మెయిన్‌టెయిన్ చేశాడు లోకేష్. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌ని థ్రిల్ చేసే సీక్వెన్స్‌లు సినిమాలు ఉన్నట్టు అర్థమవుతోంది. సీరియస్‌గా నడుస్తున్న ట్రైలర్‌ని చిన్న కామెడీ టచ్‌తో ఎండ్ చేశారు రజినీకాంత్. మొత్తానికి ట్రైలర్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసారని చెప్పొచ్చు. ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడానికి లోకేష్ ఎంతో తెలివిగా ఈ ట్రైలర్‌ను కట్ చేశాడు. మరి ఆగస్ట్ 14న ‘కూలీ’ చిత్రం ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్‌టైన్ చేస్తుంది, ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందీ అనేది చూడాలి.
![]() |
![]() |