![]() |
![]() |
ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వార్తలు చాలా వేగంగా వైరల్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లకు సంబంధించిన విషయాలు మెరుపు వేగంతో దూసుకుపోతాయి. అందులో నిజానిజాలు ఏమిటి అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే.. ఒక కంపెనీ చరణ్‌కి 15 కోట్లు ఆఫర్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేశాడట. అదీ ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్.
వివరాల్లోకి వెళితే... సాధారణంగా హీరోలు, హీరోయిన్లు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తుంటారు. దాని కోసం కోట్లలో పారితోషికం అందుకుంటారు. అయితే తమ కెరీర్‌లో ఒక్క యాడ్ కూడా చెయ్యని హీరోలు కూడా ఉన్నారు. చరణ్ కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు ఒక ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసేందుకు 15 కోట్లు ఆఫర్ ఇచ్చిందట ఆ సంస్థ. కానీ, దాన్ని చేసేందుకు చరణ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అది చిన్న పిల్లల ఫుడ్‌కి సంబంధించిన యాడ్. అందులో హానికరమైన కెమికల్స్ ఉంటాయని తెలుసుకున్న చరణ్ ఆ యాడ్ చేసేందుకు అంగీకరించలేదు. పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టే అలాంటి ప్రొడక్ట్స్‌ను తాను ప్రమోట్ చెయ్యనని చెప్పారట.
ఇది అఫీషియల్‌గా వచ్చిన వార్త కాదు. సోషల్ మీడియాలో ఇది సర్క్యులేట్ అవుతోంది. అది నిజమా, కాదా అనేది పక్కన పెడితే నెటిజన్ల నుంచి మాత్రం ఈ అంశంపై మంచి స్పందన వస్తోంది. పనిలోపనిగా చరణ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చరణ్ గొప్పతనాన్ని మెచ్చుకుంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఈ న్యూస్‌ను షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.
![]() |
![]() |