![]() |
![]() |

జులై 25 న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజైన మైథలాజికల్ యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహ'(Mahavatar Narsimha).రాక్షసరాజు 'హిరణ్యకశిపుడి'ని అంతమొందించడానికి విష్ణువు ఎందుకు 'నరసింహుడి అవతారంలో రావాల్సి వచ్చిందో చాలా క్లియర్ గా చూపించారు. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తు ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా విష్ణు భక్తులని అయితే భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుందని చెప్పవచ్చు. దర్శకుడు అశ్విన్ కుమార్' అంతలా తన రచనతో, దర్శకత్వ ప్రతిభతో 'మహావతార్ నరసింహ'ని మెమొరీబుల్ మూవీగా నిలిపాడు.
రీసెంట్ గా అశ్విన్ కుమార్(Ashwin Kumar)ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ ఆయనతో మాట్లాడుతు 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా శ్రీరాముడిపై లైవ్ యాక్షన్ సినిమా చేయాలని నిర్ణయించుకుంటే, శ్రీరాముడి(Sriramudu)గా ఏ హీరోని ఎంచుకుంటారని అడగడం జరిగింది. అందుకు అయన వెంటనే బదులిస్తూ 'రామ్ చరణ్'(Ram Charan)ని సెలక్ట్ చేసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మాటలు వైరల్ అవ్వడంతో, చరణ్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి 'ఆర్ఆర్ఆర్'(RRR)లో చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా కనపడినప్పుడే, అభిమానులతో పాటు చాలా మంది చరణ్ శ్రీరాముడిగా కూడా అనిపించాడని చెప్పారు. అప్పట్నుంచి శ్రీ రాముడిగా చాన్ కనపడితే బాగుండని అనుకున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ కుమార్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చరణ్' ప్రస్తుతం రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'పెద్ది'(Peddi)తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పలు ఆటల్లో ప్రావిణ్యం ఉన్న ఆటగాడిగా చరణ్ కనిపిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత 'సుకుమార్'(Sukumar)దర్శకత్వంలో చేయనున్నాడు.
![]()
![]() |
![]() |