![]() |
![]() |
.webp)
మూడున్నర దశాబ్డల నుంచి తన సంగీతంతో అభిమానులని అలరించడమే కాకుండా, భారతీయ సినిమాకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్(Ar rahman) ఆస్కార్ ని కూడా అందుకున్న ఈ లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్ గా చాతి నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.దీంతో ఒక్కసారిగా అభిమానులతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది.డిహైడ్రేషన్,గ్యాస్ట్రిక్ సమస్యల వలన రెహ్మన్ అస్వస్థతకి గురయ్యారని డాక్టర్స్ ధ్రువీకరించి,డిశ్చార్జ్ చెయ్యడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.
రీసెంట్ గా ఏ ఆర్ రెహ్మాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య సైరాభాను(Saira Banu)మాట్లాడుతు రెహ్మాన్ బంగారం లాంటి వ్యక్తి.ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.అల్లా దయతో ఇప్పుడు బాగానే ఉన్నారు.కాకపోతే నా గురించి ప్రస్తావించేటప్పుడు రెహ్మాన్ మాజీ భార్య అనకండి.మేమిద్దరం ఇంకా అధికారకంగా విడాకులు తీసుకోలేదు.గత కొంత కాలంగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను.అందుకే దూరంగా ఉంటున్నాం.అంతే కానీ విడాకులు తీసుకోలేదని స్పష్టం చేసింది.
రెహ్మన్, సైరా దంపతులు 1995 లో వివాహం చేసుకున్నారు.జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల వల్ల విడాకులు తీసుకుంటున్నామని,సైరాభానునే గత ఏడాది నవంబర్ లో తన న్యాయవాది ద్వారా ప్రకటన విడుదల చేసింది.ఆ టైంలో రెహ్మన్ కూడా ట్వీట్ చేస్తు తన హృదయం ముక్కలయ్యిందని,సైరా బాగుండాలని తెలిపాడు.ఈ నేపథ్యంలో ఇప్పుడు తన ఆరోగ్యం బాగోకపోవడం వలన దూరంగా ఉంటున్నామని సైరా చెప్పడంతో సరికొత్త వాదనలు తెర మీదకి వస్తున్నాయి.ఆమె హెల్త్ కి ఏమైందనే చర్చ కూడా మొదలయ్యింది.అభిమానులు అయితే ఆ ఇద్దరు కలిసుండాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.
![]() |
![]() |