![]() |
![]() |

పీపుల్స్ స్టార్ గా ఎన్నో చైతన్యవంతమైన చిత్రాలలో నటించి,నిర్మించి,దర్శకత్వం వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్ నారాయణ మూర్తి(R narayanamurthy)తన సినిమాల ద్వారా బడుగు బలహీన వర్గాల వారిని మేల్కొలోపడంతో పాటు,ప్రభుత్వాలు ప్రజలకోసం ఎలాంటి పనులు చేపట్టాలో కూడా చెప్పడం నారాయణ మూర్తి స్టైల్.ఎర్ర సైన్యం,చీమల దండు, ఒరేయ్ రిక్షా,భీముడు, చీకటి సూర్యులు,దండకారణ్యం, వీర తెలంగాణ,పోరు తెలంగాణ, పీపుల్స్ వార్, దండకారణ్యం, వంటి పలు చిత్రాలు ఆయన నుండి రాగా తెలుగు చిత్ర సీమతో నాలుగున్నర దశాబ్డల అనుబంధం కూడా ఉంది.
నారాయణ మూర్తి రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలవడం జరిగింది.ముఖ్యమంత్రి నివాసానికి నారాయణ మూర్తి వెళ్లగా సి ఎం ఆయన్ని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు.అనంతరం రేవంత్ రెడ్డికి తెలంగాణ(Telangana)తల్లి చిత్ర పటాన్నినారాయణమూర్తి ఇవ్వడం జరిగింది.
![]() |
![]() |