![]() |
![]() |

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ ఫిల్మ్ తో సినీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'రాబిన్ హుడ్' సినిమాలో వార్నర్ గెస్ట్ రోల్ చేశాడు. ఇప్పుడు ఇదే బాటలో మన స్టార్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) సైతం పయనించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏకంగా రామ్ చరణ్ (Ram Charan) సినిమాలో ధోని గెస్ట్ రోల్ ప్లే చేయనున్నాడనే వార్త సంచలనంగా మారింది. (RC 16)
రామ్ చరణ్ తన 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇందులో కోచ్ గా శివ రాజ్ కుమార్, ప్లేయర్ గా రామ్ చరణ్ కనిపిస్తారని వినికిడి. ఇదిలా ఉంటే, ఈ మూవీలో క్రికెట్ కోచ్ పాత్రలో ధోని కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, నిజమైతే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అసలే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో, ఆయనకు తోడు ధోని గెస్ట్ రోల్ చేస్తే.. సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయని చెప్పవచ్చు.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న 'RC 16' ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉంది.
![]() |
![]() |