![]() |
![]() |
.webp)
స్టార్ హీరోయిన్ 'శ్రీలీల'(Sreeleela)గత ఏడాది 'పుష్ప 2'(Pushpa 2)లో చేసిన 'కిస్సిక్' సాంగ్ లో సూపర్ గా డాన్స్ చేసి నేషనల్ లెవల్లో క్రేజ్ ని సంపాదించింది.ఎంతలా అంటే పుష్ప 2 కి ముందు శ్రీలీల క్రేజ్ వేరు,పుష్ప 2 తర్వాత వేరు అనేంతలా.ఆ ఉత్సాహంతో ఇప్పుడు నితిన్(Nithiin)తో 'రాబిన్ హుడ్'(Robin Hood)చేస్తుండగా,మార్చి 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో పాటు 'భూల్ భూలయ్య ౩ 'ఫేమ్ 'కార్తీక్ ఆర్యన్'(Karik Aryan)తో కలిసి బాలీవుడ్ లో ఒక మూవీ చేస్తుంది.కార్తీక్ ఆర్యన్,శ్రీలీల డేటింగ్ లో ఉన్నారంటు గత కొన్ని రోజులుగా బి టౌన్ లో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.ఈ విషయంపై కార్తీక్, శ్రీలీల మాత్రం స్పందించలేదు.
రీసెంట్ గా బాలీవుడ్ నటినటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 25వ 'ఐఫా'(Iifa)అవార్డ్స్ వేడుక జరిగింది.భూల్ భూలయ్య 3 లో ఉత్తమ నటన కనపరిచినందుకు కార్తీక్ ఆర్యన్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.దీంతో కార్తీక్ ఆర్యన్ తల్లి ప్రముఖ గైకాలజిస్ట్ మాలా తివారి హాజరయ్యారు.ఆమెని ఉద్దేశించి దర్శకుడు కరణ్ జోహార్(Karan Johar)మాట్లాడుతు మీకు ఎలాంటి కోడలు కావాలని అడగడం జరిగింది. దాంతో ఆమె మాట్లాడుతు 'మంచి వైద్యురాలు కోడలుగా రావాలని బదులిచ్చింది.దీంతో శ్రీలీల,కార్తీక్ ఆర్యన్ డేటింగ్ వార్తలకి మరింత ఆజ్యం పోసినట్లయింది.ఎందుకంటే శ్రీలీల నటిగా రాణిస్తూనే ఎంబిబిబిఎస్ కూడా చదువుతున్న విషయం తెలిసిందే.
మరికొంత ముందైతే కార్తీక్ ఆర్యన్ తల్లితండ్రులిద్దరు డాక్టర్స్ కాబట్టి,కాబోయే కోడలు కూడా డాక్టర్ అయ్యిండాలని కోరుకోవడం సహజమని కూడా అంటున్నారు.కొన్ని రోజుల క్రితం అయితే కార్తీక్ ఇంటికి కూడా శ్రీలీల వెళ్ళింది.కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే 2011 లో ప్యార్ కా పంచనామాతో ఆరంగ్రేటమ్ చేసి,లవ్ ఆజ్ కల్,భూల్ భూలయ్య 2 ,ధమాకా,భూల్ భూలయ్య ౩, చందు ఛాంపియన్ వంటి హిట్లతో ముందుకు దూసుపోతున్నాడు.ప్రస్తుతం అనురాగ బసు మూవీలో చేస్తుండగా ఇందులోనే శ్రీలీల,కార్తీక్ జోడీగా చేస్తున్నారు.
![]() |
![]() |