![]() |
![]() |

'పుష్ప-2'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాలను దర్శకులు త్రివిక్రమ్, అట్లీ లతో చేయనున్నాడు. అలాగే, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లోనూ ఒక సినిమా కమిటై ఉన్నాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా.. ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ చేతులు కలిపే అవకాశముందనే వార్త సంచలనంగా మారింది. (Allu Arjun)
'గేమ్ ఛేంజర్'తో పాన్ ఇండియా ఆశలు నెరవేరకపోవడంతో.. మరో భారీ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని నిర్మాత దిల్ రాజు చూస్తున్నాడు. ఈ క్రమంలో దిల్ రాజుకి అల్లు అర్జున్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో బన్నీకి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరు.. 'ఆర్య', 'పరుగు', 'డీజే' వంటి సినిమాలు చేశారు. ఆ అనుబంధంతోనే దిల్ రాజు బ్యానర్ లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పాడట. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తానని గతంలో మాట ఇచ్చి ఉన్నాడు. దాంతో బన్నీ-నీల్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడట.
అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబో ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. ఈ కాంబో మూవీ మొదలు కావడానికి కనీసం మూడు నాలుగేళ్లు పట్టే అవకాశముంది. ఇప్పటికే బన్నీ కొన్ని సినిమాలు కమిటై ఉన్నాడు. నీల్ కూడా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తున్నాడు. ఆ తర్వాత సలార్-2 తో పాటు.. రామ్ చరణ్, యశ్ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. కావున, బన్నీ-నీల్ మూవీ ఓకే అయినా.. పట్టాలెక్కడానికి చాలా టైం పడుతుంది. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొచ్చినా.. సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |