![]() |
![]() |
.webp)
అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ssmb 29 కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheh Babu) కంప్లీట్ గా తన మేకోవర్ స్టైల్ ని మార్చేసిన విషయం తెలిసిందే.మహేష్ లుక్ ని చిత్ర బృందం అధికారకంగా రిలీజ్ చేయకపోయినా,సోషల్ మీడియాలో మహేష్ పిక్స్ ఫుల్ వైరల్ అవుతు వస్తున్నాయి.దీంతో ssmb 29 లో ఒక కొత్త మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ తో ఉన్నారు.
మహేష్ రీసెంట్ గా ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాలో అడుగుపెట్టాడు.కోరాపుట్ జిల్లాలో ఉన్న 'తోలోమాలి',దేవ్ మాలి,మాచ్ ఖండ్ ఏరియాల్లో ssmb 29 షూటింగ్ జరుపుకోనుంది.'తోలోమాలి 'పర్వతంపైన అయితే చిత్ర యూనిట్ పెద్ద సెట్ నే వేసింది . ఈ సెట్ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కూడా కలిగించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.పైగా షూటింగ్ జరిగిన అన్ని రోజులు 'దేవ్ మాలి' పర్వతంపైనే మహేష్ ఉండనున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లని కూడా చిత్ర యూనిట్ రెడీ చేసింది.
ఇక ఈ మూవీలో గత కొన్ని రోజుల నుంచి మలయాళ సూపర్ స్టార్స్ లో ఒకడైన పృథ్వీ రాజ్ సుకుమారన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.పృథ్వీ రాజ్ కూడా ఈ మధ్యనే ssmb 29 లో ఉన్నట్టుగా చిన్న హింట్ లాంటిది కూడా ఇస్తు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు.ఇప్పుడు ఆ వార్త నిజమని తేలిపోయింది.ఎందుకంటే పృథ్వీ రాజ్ కూడా మహేష్ తో పాటే 'దేవ్ మాలి' పర్వతంపైన ఉన్నాడు. మిగతా నటీనటులు కూడా త్వరలోనే అక్కడకి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.దుర్గ ఆర్ట్స్ పతాకంపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన కె ఎల్ నారాయణ(Kl Narayana) అత్యంత భారీ వ్యయంతో ssmb 29 ని నిర్మిస్తున్నాడు.మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తుండగా,కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.రాజమౌళి(Ss Rajamouli) తన గత చిత్రాలని మించి ఈ సినిమాని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.
![]() |
![]() |