![]() |
![]() |

'అర్జున్ రెడ్డి'(Arjun Reddy)తో తెలుగు సిల్వర్ స్క్రీన్ పైకి ఒక 'మిసైల్' లా దూసుకొచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)ఇదే మూవీని బాలీవుడ్ లోకి 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసి హిట్ ని అందుకున్న సందీప్,రణబీర్(Ranbir Kapoor)తో చేసిన 'యానిమల్'(Animal)తో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఒకడిగా ఎదిగాడు.తన సినిమాల్లో మహిళలని తక్కువ చేసి చూపిస్తాడనే కామెంట్స్ కూడా కొంత మంది వ్యక్తం చేస్తుంటారు,ముఖ్యంగా 'యానిమల్' కి ఆ స్థాయి కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.
రీసెంట్ గా సందీప్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఫ్యూచర్ లో హీరో లేకుండా సినిమా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాను.నాలుగైదు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది నా లక్ష్యం.ఐదేళ్ల తర్వాత సందీప్ చెప్పింది చేసి చూపించాడని ప్రేక్షకులే ఒప్పుకుంటారు.కాకపోతే నా చిత్రాలని విమర్శించే కొంత మంది మహిళలు ఆ సినిమాని కూడా ఇష్టపడరు అని చెప్పుకొచ్చాడు.సందీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.ఇదే ఇంటర్వ్యూ లో ప్రభాస్(Prabhas)తో తెరకెక్కించబోయే స్పిరిట్ గురించి కూడా మాట్లాడటం జరిగింది
'స్పిరిట్'(Spirit)కలెక్షన్లు 'బాహుబలి'(Baahubali)ని దాటాలని నేను అనుకోవడం లేదు.2000 కోట్లు అనేది చాలా పెద్ద విషయం.'స్పిరిట్' అయితే చాలా మంచి మూవీ. ఎంత వసూళ్లు చేస్తుందనేది ప్రేక్షకుల చేతుల్లో ఉందని చెప్పుకొచ్చాడు. ఇక స్పిరిట్ మూవీ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తుండగా కాస్టింగ్ భారీ స్థాయిలో ఉండబోతుంది.హాలీవుడ్ యాక్టర్స్ కూడా స్పిరిట్ లో ఉండబోతున్నారనే వార్తలు ఎప్పట్నుంచో విన్పడుతున్నాయి. సందీప్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న స్పిరిట్ ఈ ఏడాది మధ్యలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
![]() |
![]() |