![]() |
![]() |
.webp)
2025 కి సంబంధించిన 97వ ఆస్కార్ (Oscar)వేడుకలు నిన్నరాత్రి లాస్ ఏంజిల్స్ వేదికగా డాల్బీ థియేటర్ లో అత్యంత ఘనంగా జరిగాయి.భారతీయులందరికి శుభోదయం,బ్రేక్ ఫాస్ట్ చేస్తు ఆస్కార్ వేడుకల్ని చూస్తుంటారని భావిస్తున్నాను.ఎందుకంటే మీకు ఉదయం కదా అని వ్యాఖ్యాత 'కానన్ ఓ బ్రెయిన్' హిందీలో ప్రసంగించడం ప్రారంభ వేడుకలకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆస్కార్ 2025 కి సంబంధించి ఉత్తమ నటుడుగా 'ది బ్రూటలిస్ట్'(The brutalisy)చిత్రంలో ప్రదర్శించిన నటనకి గాను'అడ్రిన్ బ్రాడీ'(Adrien Brody)ఆస్కార్ ని అందుకున్నాడు.ఈ నటుడు 2003 లో 'ది పియనిస్ట్' చిత్రంకి గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ ని దక్కించుకోవడం జరిగింది.స్టేజ్ పై అవార్డుని అందుకునే సమయంలో అవార్డుని అందచేస్తున్న బెర్రీ ని ముద్దాడాడు. ఇప్పుడు 2025 కి సంబంధిచి అవార్డు తీసుకునేటప్పుడు కూడా బెర్రీని ముద్దాడాడు.ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు 22 ఏళ్ళ తర్వాత ముద్దు సీన్ రిపీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బెర్రీ అసలు పేరు హాలీ బెర్రీ(Hlle Berry).అమెరికా చెందిన ఈ నటి 1992 లో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.'మాన్‌స్టర్స్ బాల్' లో నటనకుగాను ఉత్తమ నటి విభాగంలోఆస్కార్ ని అందుకున్నఏకైక ఆఫ్రికన్ అమెరికన్ సంతతి మహిళగా కూడా నిలిచింది.ఇక ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ 'అనోరా' నిలవడంతో పాటు ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటి,స్క్రీన్ ప్లే,ఎడిటింగ్ విభాగాల్లో కూడా 'అనోరా' ఆస్కార్ లని దక్కించుకొని తన సత్తా చాటడం 2025 ఆస్కార్ అవార్డుల్లో ప్రధాన హైలెట్.

![]() |
![]() |