![]() |
![]() |

వరల్డ్ సినీ పరిశ్రమలో ఏ భాషా చిత్రానికి సంబంధించిన వారైనా,ప్రపంచ ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఆస్కార్(Oscar)ని పొందటం గౌరవంతో పాటు హోదాగా భావిస్తారు.అంతటి ఖ్యాతి ఆస్కార్ సొంతం.1929 లో పుట్టిన 'ఆస్కార్' ని ఎన్నో దేశాలకి చెందిన సినిమాలు, మేకర్స్,నటులు,నటీమణులతో పాటు ఆల్ టెక్నీషియన్స్ అందుకున్నారు.ఈ కోవలోనే ఇప్పుడు 2025 కి సంబంధించి 97 వ ఆస్కార్ అవార్డుల్ని ఈ రోజు ఉదయం నుంచి లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా అనౌన్స్ చెయ్యడం జరుగుతు ఉంది.
ఉత్తమ చిత్రంగా అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ 'అనోరా'(Anora)నిలవడంతో పాటు ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటి,స్క్రీన్ ప్లే,ఎడిటింగ్ విభాగాల్లో కూడా 'అనోరా' ఆస్కార్ లని దక్కించుకొని తన సత్తా చాటడం 2025 ఆస్కార్ అవార్డుల్లో ప్రధాన హైలెట్.అవార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉత్తమ నటుడు:అడ్రిన్ బ్రాడీ(Adrien Brody)(ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి:మైకీ మ్యాడిసన్ (అనోరా)
ఉత్తమ దర్శకుడు : సీన్ బీకర్ (అనోరా)
బెస్ట్ స్క్రీన్ ప్లే : అనోరా
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కాన్ క్లేవ్
ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్)
ఉత్తమ సహాయనటి : జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్ )
ఉత్తమ సినిమాటోగ్రఫీ : లాల్ క్రావ్లీ (ది బ్రూటలిస్ట్)
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ఫ్లో
బెస్ట్ యానిమెటెడ్ షార్ట్ ఫిల్మ్ : ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్
క్యాస్టూమ్ డిజైనర్ : పాల్ తాజేవెల్ (విక్డ్)
ఉత్తమ ఎడిటింగ్ : సీన్ బీకర్ (అనోరా)
మేకప్, హెయిర్ స్టైలింగ్ : పియర్ ఒలివియర్ పర్సిన్, స్టీఫెన్ గులియన్, మారిలిన్ స్కార్సెల్లి (ది సబ్ స్టాన్స్ చిత్రానికి గానూ)
ఒరిజినల్ సాంగ్ : ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
ఒరిజినల్ స్కోర్ : డానియల్ బ్లంబర్గ్ (ది బ్రూటలిస్ట్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ : విక్డ్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : నో అదర్ ల్యాండ్
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : ఐ యామ్ స్టిల్ హియర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : ది బ్రూటలిస్ట్
ది బెస్ట్ సౌండ్ : డ్యూన్ పార్ట్ టు
విజువల్ ఎఫెక్ట్స్ : డ్యూన్ పార్ట్ టు
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ఐ యామ్ నాట్ ఏ రోబో
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం:ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ యానిమేటెడ్ ఫెచర్ ఫిలిం:ఫ్లో
ఇలా పలు దేశాలకి చెందిన చిత్రాలు ఆస్కార్ ని అందుకొని తమ ఖ్యాతిని మరింతగా పెంచుకున్నాయి. మన దేశం నుంచి కూడా పలు చిత్రాలు,వెబ్ సిరీస్,షార్ట్ ఫిలిమ్స్ ఆస్కార్ ని వెళ్లాయి.కానీ ఇంకా ఆస్కార్ ని అందుకోలేదు.ఆర్ఆర్ఆర్, లగాన్, స్లమ్ డాగ్ మిలినియర్, ది లంచ్ బాక్స్,సలాం బొంబే,ది ఎలిఫెంట్ విష్పెర్స్ రకరకాల విభాగాల్లో ఆస్కార్ ని అందుకున్నాయి.
![]() |
![]() |