![]() |
![]() |
.webp)
నటప్రపూర్ణ మోహన్ బాబుకి(Mohan Babu)తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం ఐదు దశాబ్దాలు.ఈ ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా,నిర్మాతగాను ఎన్నో అద్భుతమైన చిత్రాలని నిర్మించి అభిమానులు,ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలబడ్డాడు.పెద్దాయన నందమూరి తారక రామారావు తర్వాత ఆ స్థాయిలో డైలాగ్ చెప్పగల నటుడు మోహన్ బాబునే అని దర్శకరత్నదాసరి నారాయణరావు అంతటి వ్యక్తి చెప్పాడంటే మోహన్ బాబు స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారు జల్లేపల్లి లోని మోహన్ బాబు నివాసంలో మోహన్ బాబుకి, రెండవ కొడుకు మనోజ్(Manoj)కి మధ్య వాదనలు జరిగిన విషయం తెలిసిందే.ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేసి గాయపరిచాడు.దీంతో మోహన్ బాబు పై కేసు నమోదు కాగా,అనుకోకుండా జరిగిన సంఘటన అంటూ మోహన్ బాబు ముందస్తు బెయిల్ కి హైకోర్ట్ లో పిటిషన్ వేసాడు.కానీ కోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తున్నట్టుగా తీర్పుని ప్రకటించింది.ఈ తీర్పుతో మోహన్బాబు కి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు.
మోహన్ బాబు తరుపు న్యాయవాది కోర్టులో మోహన్ బాబు,ఆయన కొడుకు మధ్య జరుగుతున్న కుటుంబ గొడవల్లో బయట ప్రపంచానికి ఏం మాత్రం సంబంధం లేదు.జర్నలిస్ట్ పై జరిగిన దాడి అనుకోకుండా జరిగిన దాడి, దాడి జరిగిన తర్వాత హాస్పిటల్ కి వెళ్లి జర్నలిస్ట్ ని మోహన్ బాబు పరామర్శించాడు.ఆర్థిక సాయం కూడా చేస్తానని మోహన్ బాబు ఇప్పటికే ప్రకటించాడని కూడా సదరు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఈ విషయాలతో సుప్రీం కోర్టు ఏకీభవించడం వల్లనే బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది.
![]() |
![]() |