![]() |
![]() |

గతేడాది 'కల్కి'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో మారుతీ దర్శకత్వంలో చేస్తున్న 'ది రాజా సాబ్', డైరెక్టర్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రభాస్-హను కాంబినేషన్ మూవీకి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. (Fauji)
'ఫౌజీ'లో ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) నటిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బాహుబలి ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభాస్ తో తన 544వ సినిమా చేస్తున్నానని అనుపమ్ ఖేర్ తెలిపారు. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తన స్నేహితుడు సందీప్ ఛటర్జీ డీఓపీగా వర్క్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ చిత్ర కథ అద్భుతంగా ఉంటుందని అనుపమ్ రాసుకొచ్చారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రభాస్, హను, సందీప్ తో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ ఫొటోలలో ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్త హెయిర్ స్టైల్, కళ్ళద్దాలతో ప్రభాస్ స్టైలిష్ గా ఉన్నాడు.

![]() |
![]() |