![]() |
![]() |

నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలా రోజులైంది. చైతన్య ఇప్పటికే శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. సమంత కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకునే అవకాశముందని వార్తలొస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ చైతన్య, సమంత విడాకుల టాపిక్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చైతన్యను అభిమానించేవారు సమంత గురించి, సమంతను అభిమానించేవారు చైతన్య గురించి.. నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన చైతన్య.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. (Naga Chaitanya)
నాగ చైతన్య హీరోగా నటించిన 'తండేల్' మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య.. పలు విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా సమంతతో విడాకుల గురించి, ఆ తర్వాత వస్తున్న నెగటివ్ కామెంట్స్ గురించి.. చైతన్య ఇచ్చిన సమాధానం ఎంతో హుందాగా ఉంది.
చైతన్య తల్లి లక్ష్మి, తండ్రి నాగార్జున విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ ఆన్సర్ ఇచ్చాడు చైతన్య. తాను బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, రిలేషన్ బ్రేక్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో తనకి తెలుసని అన్నాడు. సమంతతో విడాకులు తీసుకునే ముందు, ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. విడాకులు అనేది ఎందరో జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ఇది నా ఒక్కడి జీవితంలో జరిగినది కాదు. కానీ కొందరు నేనేదో క్రిమినల్ అన్నట్టు చూస్తున్నారని చైతన్య అన్నాడు. తాను, సమంత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని, ఆ తర్వాత ఎవరి జీవితం వాళ్ళు బతుకున్నామని చెప్పాడు. కొందరు కావాలనే నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని.. వాళ్ళు అలా మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే బదులు, కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటే బాగుంటుందని హితవు పలికాడు.
ఇక నాగ చైతన్య శోభితను ప్రేమించడం వల్లనే సమంతకు విడాకులు ఇచ్చాడని కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై కూడా చైతన్య స్పందించాడు. విడాకుల తర్వాతే తాను శోభితతో ప్రేమలో పడ్డానని చెప్పాడు. అది కూడా సోషల్ మీడియా ద్వారానే తామిద్దరం పరిచయం అయ్యామని చైతన్య చెప్పుకొచ్చాడు. కొందరు శోభిత గురించి కూడా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని, అసలు ఆమెను ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. అలాగే ఎంత నెగటివిటీ వచ్చినా.. శోభిత ఎంతో మెచ్యూరిటీతో, ఎంతో పేషన్స్ తో హ్యాండిల్ చేస్తుందని.. శోభిత తన దృష్టిలో రియల్ హీరో అని చైతన్య అన్నాడు.
![]() |
![]() |