![]() |
![]() |
.webp)
'కిక్' మూవీతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన థమన్(THaman)ఆ తర్వాత, బృందావనం,మిరపకాయ్,దూకుడు,బిజినెస్ మెన్,నాయక్,సరైనోడు,రేసుగుర్రం,అల వైకుంఠ పురం, అఖండ,గుంటూరుకారం,వకీల్ సాబ్,భగవంత్ కేసరి,క్రాక్, రీసెంట్ గా విడుదలైన డాకు మహారాజ్ వంటి పలు సినిమాలకి అధ్బుతమైన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించడం జరిగింది.తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో కూడా ఒకడిగా కొనసాగుతున్నాడు.
రీసెంట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఇన్నేళ్ల సినీ కెరీర్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను.ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకర్ని నమ్మి మోసపోతారు.నేను కూడా ఆ విధంగా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి.చాలా మందిని నమ్మాను.కానీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారు.నా ముందు మంచిగా ఉండి ఆ తర్వాత బయటకి వెళ్ళాక,నా గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు.అలాంటి వారి వల్ల డబ్బు కూడా నష్టపోయాను.ఇలాంటి ఎన్నోఒడిదుడుకుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.
థమన్ ప్రస్తుతం బాలకృష(Balakrishna)110 వ మూవీ గా తెరకెక్కుతున్న అఖండ 2 ,పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఓజి తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేస్తున్నాడు.రీసెంట్ గా బేబీ జాన్ అనే హిందీ చిత్రానికి సంగీతాన్ని అందించి బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు.
![]() |
![]() |