![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన 'ఎన్ కౌంటర్'(Encounter)తో తెలుగు చిత్ర సీమకి పరిచయమైన దర్శకుడు శంకర్(n.Shankar).ఆ తర్వాత జయంమనదేరా,శ్రీరాములయ్య, భద్రాచలం,జై భోలో తెలంగాణ వంటి హిట్ చిత్రాలని ప్రేక్షకులకి అందించాడు.సామాజిక ఇతి వృత్తంతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడుగా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించిన శంకర్ గత కొంత కాలంగా సినిమాలు చెయ్యటం లేదు.
ఇప్పుడు శంకర్ కొడుకు దినేష్‌మహీంద్ర(Dinesh Mahindra)తెలుగు చిత్ర సీమకి పరిచయంకాబోతున్నాడు.కాకపోతే హీరోగా కాకుండా తండ్రి బాటలో దర్శకత్వ శాఖలోకి అడుగుపెడుతున్నట్టుగా తెలుస్తుంది.స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగానికి సంబంధించిన పలు కోర్సులని కూడా పూర్తి చేసిన దినేష్,త్వరలోనే కొత్త వారితో ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ని తెరకెక్కించబోతున్నాడు.ఈ చిత్రాన్ని‘ఆరెక్స్ క్రియేషన్స్’ సంస్థ నిర్మించబోతుండగా,షూటింగ్ కూడా ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని,ప్రస్తుతం పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

![]() |
![]() |