![]() |
![]() |
.webp)
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)రీసెంట్ గా 'తండేల్'(Thandel)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.చైతు కెరీర్ లోనే హైబడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ హిట్ దిశగా దూసుకెళ్తుందని,రీసెంట్ గా చిత్ర బృందం సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించింది.సాయి పల్లవి(Sai Pallavi)హీరోయిన్ గా చెయ్యగా,చందు మొండేటి(Chandu Mondeti)దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ తండేల్ ని నిర్వహించింది.
చైతు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నాకు ఎలాంటి రాజకీయాలు తెలియవు.సినిమా కోసం పని చేసానా,ఇంటికి వెళ్ళానా,మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్టుగా ఉంటా.దాంతో పీఆర్ టీం పై దృష్టి సారించలేకపోయాను.కాని ప్రస్తుత పరిస్థితుల్లో పిఆర్ టీం చాలా అవసరం.కనీసం నెలకి రెండు మూడు లక్షల అయినా పి ఆర్ టీం కోసం ఖర్చుపెట్టి మన సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చెయ్యాలి.ఇందులో ఎలాంటి తప్పు లేదు.కాకపోతే అనవసర ప్రచారాలు చేస్తు,పక్కోడిని తొక్కేయడానికి చూస్తున్నారు.ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాదు. అలా పక్కోడిని తొక్కేసే టైంని మీ జీవితంలో ఎదుగుదలకి ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పుకొచ్చాడు.
సమంత(Samantha)తో విడాకులు జరిగిన విషయంలో కూడా మాట్లాడుతూ విడాకులు నైట్ కి నైట్ తీసుకున్న నిర్ణయం కాదు.ఎన్నో రోజుల తర్వాతే విడాకులు నిర్ణయం తీసుకున్నాం.మా విడాకులు ఇతరులకు వినోదం అయిపోయిందని కూడా తెలిపాడు.
![]() |
![]() |