![]() |
![]() |

విమానాశ్రయాల్లో ఎందరో ప్రముఖులకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా నటి మంచు లక్ష్మికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఇది ఒక రకమైన వేధింపు ఇండిగో సిబ్బంది తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. (Manchu Lakshmi)
విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా బ్యాగ్ ను పక్కకు తోసేశారు. నా బ్యాగ్ నన్ను ఓపెన్ చేయడానికి కూడా వారు అనుమతించలేదు. పైగా వారు చెప్పిన విధంగా చేయకపోతే, నా లగేజ్ ను గోవాలో వదిలేస్తామని అన్నారు. సిబ్బంది చాలా దురుసుగా ప్రవరించారు. ఇది కూడా ఒక రకమైన వేధింపు. నా కళ్ళ ముందు సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఏదైనా వస్తువు మిస్ అయితే బాధ్యత తీసుకుంటారా? అసలు ఎయిర్ లైన్స్ ను ఈ విధంగా ఎలా నడుపుతున్నారు? ఇకపై నేను ఈ ఎయిర్ లైన్స్ కి దూరంగా ఉంటాను." అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఇండిగో తీరుని తప్పుబట్టారు.

![]() |
![]() |