![]() |
![]() |
.webp)
నందమూరి బాలకృష్ణ(Balakrishna)కి సినిమా రంగంలో నటకిశోరం,యువరత్న,బాక్సాఫీస్ బొనాంజా,గాడ్ ఆఫ్ మాసెస్ అనే బిరుదులూ ఉన్నాయి.వాటికి తగ్గట్టే ఐదుదశాబ్డల నుంచి తన నటనతో అభిమానులని,ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నాడు.రీసెంట్ గా బాలయ్యకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ని ప్రకటించింది.దీంతో అభిమానులతో పాటు,తెలుగు ప్రజలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందరి తారకరామారావు(Ntr)నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్యకి నటనలో మొదటి గురువు తండ్రి ఎన్టీఆర్ నే.ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో బాలయ్య పలు రకాల పాత్రలు పోషించి,చిరు ప్రాయంలోనే నటనకి సంబంధించి తనలో ఒక కొత్త శక్తీ దాగుందని అందరు అనుకునేలా చేసాడు.ఇందుకు ఉదాహరణగా పద్నాలుగేళ్ల వయసులో 'తాతమ్మ కల' సినిమాలో లెజండ్రీ నటీమణి భానుమతి గారి ముందే ఎలాంటి బెరుకు లేకుండా నటించి,ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ఒక చాప్టర్ ఉండేలా చేసుకున్నాడు.తండ్రి ఎన్టీఆర్ లాగా ఒకే జోనర్ కి సంబంధించిన చిత్రాల్లో కాకుండా,సాంఘిక,పౌరాణిక,జానపద, ఫిక్షన్,ఫ్యాక్షన్,ఫ్యామిలీ ఇలా అన్ని రకాల జోనర్స్ లోను నటించి బాలయ్య ని టచ్ చెయ్యాలంటే మళ్ళీ ఇంకో బాలయ్య పుట్టాలనేంతగా తెలుగు సినిమాని ప్రభావితం చేసాడు.
ఫ్యాక్షన్ తరహా చిత్రాల ద్వారా అయితే నటనలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కే ఇనిస్ప్రేషన్ గా నిలిచాడంటే బాలయ్య నటనకి ఉన్న స్టామినా అని అర్ధం చేసుకోవచ్చు.ప్రేమ కరుణ,భయానకం,రౌద్రం వంటి సన్నివేశాల్లో బాలయ్య నటన చూడటానికి రెండు కళ్ళు చాలవు. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి ఎంతో మంది టెక్నీషయన్స్ ని తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర సీమకి అందించాడు. మొన్న సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ వరకు బాలయ్య 109 చిత్రాల్లో నటించగా,నంబర్ ఆఫ్ సినిమాలుశతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ లు ఆడి ఎంతో మందికి జీవనోపాధి కూడా కలిగింది.యాభై రోజులు ఆడటానికే గగనమైన ఈ రోజుల్లో కూడా బాలయ్య సినిమాలు ఒన్ ఇయర్ కూడా ఆడుతున్నాయంటే బాలయ్య ప్రభావం ప్రేక్షకుల్లో ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఈ విధంగా కళా రంగంలో సుదీర్ఘ సేవలందిస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ ని ప్రకటించింది.రాబోయే రోజుల్లో మరిన్ని గౌరవప్రదమైన పురస్కారాలని అందుకోవాలని ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రజలు కూడా కోరుకుంటున్నారు.రాజకీయాల్లో కూడా ముందుకు దూసుకుపోతు హిందూపురం నుంచి హాట్ట్రిక్ ఎంఎల్ఏ గా ప్రజలకి సేవలందిస్తున్నాడు.తన తల్లి బసవ తారకం(Basava Tharakam)పేరు మీద హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పి తక్కువ ధరకే ప్రజలకి వైద్యాన్ని అందిస్తు ప్రజల గుండెల్లో కొలువుతీరాడు.
![]() |
![]() |