![]() |
![]() |

ప్రస్తుత వాతావరణాన్నిచూస్తుంటే మెగా వర్సస్ అల్లు అభిమానుల గొడవ కి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గా జనసేన పార్టీ ఎమ్మెల్యే తో పాటు, ముఖ్య నాయకుడు ఒకరు అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్ లో నాకు నచ్చితే ఎంత వరకైనా వెళ్తాను. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడతానని అల్లు అర్జున్ మాట్లాడాడు కాబట్టే మేము అలా మాట్లాడమనేది వాళ్ళ వాదన. పైగా మెగా ఫ్యామిలీ జోలికి వస్తే మళ్ళీ కౌంటర్లు వెయ్యడానికి రెడీ అని కూడా అంటున్నారు.దీంతో మళ్ళీ మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయ్యింది. సోషల్ మీడియాలో ఇరువురి అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని నానా తిట్లు తిట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఫోటో చక్కర్లు కొడుతుంది.
చిరంజీవి(chiranjeevi)కి అల్లు రామలింగయ్య(allu ramalingaiah)గారంటే ఎంత అభిమానమో అందరకి తెలిసిందే. పేరుకి పిల్లని ఇచ్చిన మావయ్య అయినా కూడా తన గురువుగా భావిస్తాడు. ఈ విషయాన్నీ చిరు చాలా సందర్భాల్లో చెప్పాడు.ఇప్పుడు చిరంజీవి ఇంట్లో అల్లు రామలింగయ్య ఫోటో ఒకటి దర్శనమిచ్చింది. పూజా మందిరంలో దేవుడి ఫొటోలతో పాటు చిరంజీవి తండ్రి వెంకట్రావు ఫొటో, మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు ఉన్నాయి.దీంతో దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్లుగా భావిస్తూ చిరు నిత్యం పూజలు చేస్తున్నాడనే విషయం అర్ధమవుతుంది. మెగా, అల్లు ఫ్యాన్స్ గొడవల మధ్య ఈ ఫోటో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి వీటిని చూసైనా ఫ్యాన్స్ వార్ కి శుభం కార్డ్ పడుతుందేమో చూడాలి.

అలాగే మెగా, అల్లు వివాదం ఇండస్ట్రీకి అంత మంచిది కాదని, పైగా పుష్ప 2(pushpa 2)గేమ్ చేంజర్(Game Changer)లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు డిసెంబర్ లో విడుదల కానున్నాయి. కాబట్టి నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా చిరు, అరవింద్ లు ప్రత్యేకంగా ఈ గొడవలపై కల్పించుకోవాలి పలువురు సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు కూడా కోరుతున్నారు.
![]() |
![]() |