![]() |
![]() |

ఓ వైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు హీరోగానూ రాణిస్తున్నాడు ప్రియదర్శి (Priyadarshi). 'బలగం'తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న దర్శి.. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'సారంగపాణి జాతకం' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే న్యాచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి నిర్మిస్తున్న సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'కోర్ట్' (Court) అనే టైటిల్ పెట్టారు. 'State vs A Nobody' అనేది క్యాప్షన్. టైటిల్ ని రివీల్ చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులు జరిగినట్లుగా ఛార్జ్ షీట్ కనిపిస్తుంది. అలాగే కోర్ట్ ని, కోర్ట్ బోన్ లో ఉన్న న్యాయదేవత బొమ్మని చూపించారు. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా అని తెలుస్తోంది. మరి ఇందులో అమ్మాయి తరపున న్యాయం కోసం పోరాడే లాయర్ గా ప్రియదర్శి కనిపిస్తాడేమో చూడాలి.

![]() |
![]() |