![]() |
![]() |

ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న 'కుబేర'లో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నాగ్ నటిస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ 'కూలీ'. సన్ పిక్చర్స్ బ్యానర్ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సైమన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. నాగ్ పుట్టినరోజు(ఆగస్టు 29) సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి, సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. గుబురు గడ్డం, కళ్ళద్దాలతో.. చేతికి గోల్డ్ వాచ్ పెట్టుకొని నాగార్జున లుక్ అదిరిపోయింది. నాగ్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు.
![]() |
![]() |