![]() |
![]() |

ముంబై సినీ నటి ఆషా జెత్వానీ(asha jethwani)కేసు ఇప్పుడు తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రజాప్రతినిధి కొడుకు జెత్వానీ ని ప్రేమ పేరుతో లొంగ దీసుకోవడమే కాకుండా రివర్సు లో ఆమెని, ఆమె కుటుంబ సభ్యుల్ని చిత్ర హింసలకి గురి చేసాడు.అదంతా గత ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే జరిగిందనే వార్తల నేపథ్యంలో జెత్వానీ ముంబై నుంచి విజయవాడ కి బయలు దేరింది. ఈ క్రమంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లొ మీడియాతో ముచ్చటించింది.
నా పై అక్రమ కేసులు పెట్టీ ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాటన్నింటిని ప్రభుత్వానికి అందిస్తాను. నా కుటుంబ సభ్యులను కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అదే విధంగా నేను డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి నేను చేసే విన్నపం ఒక్కటే, నాకు జరిగిన అన్యాయంపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాని చెప్పింది. అలాగే ఏపీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని కూడా చెప్పింది.
ఇక జైత్వాని విషయంలో ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు యావత్తు ప్రజానీకం తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సంఘాలు అయితే నీరాజనాలు పలుకుతున్నారు. ఇక నరకాసురులకి చంద్రన్న ట్రీట్ మెంట్ మొదలు కానుందనే మాటలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పోలీసులు ముంబై వెళ్లి మరి జైత్వాని ని తీసుకువస్తున్నారు
![]() |
![]() |