![]() |
![]() |
.webp)
ఈ రోజు టాలీవుడ్ మన్మధుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున(nagarjuna)పుట్టిన రోజు. అభిమానులకి మాత్రం పండుగ రోజు. అందుకు తగ్గట్టుగానే బర్త్ డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అదే విధంగా చాలా ఏరియాస్ లో నాగ్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన మాస్ మూవీని ప్రదర్శిస్తే అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు నాగ్ అప్ కమింగ్ మూవీ నుంచి అభిమానులకి ఇంకో గిఫ్ట్ కూడా వచ్చింది.
నాగ్ కుబేర(kubera)అనే మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్(dhanush)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటుగా శేఖర్ కమ్ముల(sekhar kammula)దర్శకుడు కావడంతో అందరిలో కుబేర మీద భారీ అంచనాలే ఉన్నాయి.ఇకనాగ్ బర్త్ డే సంధర్భంగా మేకర్స్ నాగ్ పోస్టర్ ఒక దాన్ని రిలీజ్ చేసారు. అందులో నాగార్జున చాలా సరదాగా ఉంటూ ఎవరికో హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లుక్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ని కూడా ఆకట్టుకుంటుంది.అంతే కాదు నిమిషాల్లోనే రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.

మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు నాగార్జున చాలా సీరియస్ లుక్ లో ఉన్నాడు. ఇప్పుడు చాలా జోవియల్ గా ఉన్నాడు. సో కుబేర లో నాగ్ నటన రెండు పార్శ్యాలుగా సాగుతుందేమోననే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. రష్మిక(rashmikha)కధానాయికగా చేస్తుండగా శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
![]() |
![]() |