![]() |
![]() |

తమిళ సూపర్ స్టార్స్ లో అజిత్(ajith)కూడా ఒకడు. అభిమానులందరు ముద్దుగా థలా అని పిలుచుకోవడంతో పాటుగా మూవీ రిలీజ్ రోజున తమిళనాడు మొత్తం పండుగ వాతావరణాన్ని తీసుకొస్తారు. మరి అలాంటి అజిత్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఆ రూమర్ కి ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్ యోగిబాబు చెక్ పెట్టాడు.
ప్రెజంట్ యోగిబాబు(yogibabu)కి తమిళనాటనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం మంచి క్రేజ్ ఉంది. ఆయన కామెడీ టైమింగ్ కి నవ్వని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అలాంటి యోగిబాబు ని అజిత్ కుమార్ ముట్టుకోనివ్వకుండా దూరం పెట్టాడనే రూమర్ ఒకటి కొన్ని రోజుల నుంచి స్ప్రెడ్ అవుతుంది.దీంతో అంటరానితనంతో యోగిబాబుని అవమానించాడంటూ సోషల్ మీడియా వేదికగా అజిత్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ కాంట్రవర్సీకి యోగిబాబు సింపుల్ గా చెక్ పెట్టాడు.

ఒక ప్లేస్ లో రాజేంద్రన్ అనే కమెడియన్ తో కలిసి యోగిబాబు కూర్చోని ఉంటే ఆ ఇద్దరిని అజిత్ ఫొటో తీస్తున్నాడు. ఇప్పడు ఆ పిక్ ని యోగిబాబు ఎక్స్ వేదికగా షేర్ చెయ్యడంతో పాటుగా నా ఫెవరెట్ స్టిల్ ఇది, మై డియర్ థలా అజిత్ కుమార్ అంటూ క్యాప్షన్ ని కూడా ఉంచాడు. సో అజిత్, యోగిబాబు విషయంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక అజిత్ ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లీ(good bad ugly)అనే మూవీలో చేస్తున్నాడు. తెలుగు అగ్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా అదిక్ రవిచంద్రన్ దర్శకుడు. నెక్స్ట్ ఇయర్ జనవరి కి సందడి చేయనుంది.
![]() |
![]() |