![]() |
![]() |

తంగలాన్(thangalaan)కంగువా(kanuguva)..విక్రమ్(vikram)సూర్య(suriya)లాంటి టాప్ స్టార్ నుంచి వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాల మీద ఇండియన్ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తంగలాన్ వరల్డ్ వైడ్ గా అగస్ట్ 15 న విడుదల అవుతుండగా కంగువా అక్టోబర్ పది న రిలీజ్ కానుంది. ఇప్పడు ఈ రెండు భారీ సినిమాలకి భారీ చిక్కొచ్చి పడింది.
కె .ఈ జ్ఞానవేల్ రాజా(k.e jnanavel raja) గ్రీన్ స్టూడియో బ్యానర్ పై తమిళ చిత్ర సీమలో పేరెన్నికగన్న బడా నిర్మాత.ఎన్నో భారీ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తంగలాన్, కంగువా కి కూడా జ్ఞానవేల్ రాజా నే నిర్మాత. 2011లో అర్జున్ లాల్ సుందరదాస్ అనే వ్యక్తి ఒక సినిమా నిర్మాణం కోసం గ్రీన్ స్టూడియోకి సుమారు పన్నెండున్నర కోట్ల రూపాయలు దాకా ఇచ్చాడు. కానీ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అర్జున్ లాల్ కి మొత్తం డబ్బులు ఇవ్వకుండా రెండున్నర కోట్లు మాత్రమే గ్రీన్ స్టూడియో ఇచ్చింది. ఆ తర్వాత కాలక్రమంలో అర్జున్ లాల్ మరణించడంతో అతని కుటుంబం డబ్బులు కోసం గ్రీన్ స్టూడియోస్‌పై కేసు వేసింది. కానీ జ్ఞానవేల్ రాజా మాత్రం మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా అర్జున్ లాల్ తమకి పన్నెండున్నర కోట్లు ఇచ్చాడు. అంతే తప్ప తనకు వేరే ఎలాంటి డబ్బు ఇవ్వలేదని కోర్టుకి చెప్పాడు. 2015 వరదల్లో అందుకు సంబంధించిన అసలు రికార్డు పోయిందని, సాక్ష్యంగా డాక్యుమెంట్ రూపంలో కేవలం ఒక జిరాక్స్ కాపీ ని మాత్రమే కోర్టుకుప్రెజంట్ చేసాడు .
ఆ తర్వాత విచారణలో అప్పటి గ్రీన్ స్టూడియో కార్యాలయం రెండవ అంతస్తులో ఉందని, ఎలాంటి ఫైళ్లు వరదల్లో పోలేదని నిర్ధారించబడింది.దీంతో గ్రీన్ స్టూడియోస్ బాకీగా ఉన్న పదికోట్ల రూపాయలని చెల్లించాలని పైగా పద్దెనిమిది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ కుటుంబం దావా వేసింది. కేసును విచారించిన కోర్టు గ్రీన్ స్టూడియోస్ నేరం చేసినట్లుగా గమనించి ఏదైనా సినిమా విడుదలకు ముందు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.మద్రాసు హైకోర్టులో కేసు విచారణ కొనసాగింది.
![]() |
![]() |