![]() |
![]() |
.webp)
ఫ్యాన్స్ హర్ట్ అయితే ఏ హీరో కూడా ఊరుకోడు. అందులోను ప్రిన్స్ మహేష్ బాబు(mahesh babu)అయితే అస్సలు ఊరుకోడు. ఫ్యాన్స్ కోసం ఎంత దాకైనా, ఏం చేయడానికైనా వెనుకాడడు. ఈ విషయం చాలా సంధర్భాల్లో చాలా సార్లు రుజువయ్యింది. రీసెంట్ గా మహేష్ మీద ఫ్యాన్స్ చిరు కోపంతో ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన మహేష్ వాళ్ళకి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.
నిన్న మహేష్ బర్త్ డే ని అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వరల్డ్ వైడ్ గా ఆ సంబరాలు అంబరాన్ని కూడా అంటాయి. అన్నదానాలు, రక్తదానాలు లాంటివి కూడా జరిగాయి. పైగా మురారి రీ రిలీజ్ కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.ఆల్ ఏరియాస్ లో సరికొత్త రికార్డులు సృష్టించుకుంటూ కూడా వెళ్తుంది.ఇక అసలు విషయానికి వస్తే బర్త్ డే సందర్భంగా తమ గురించి మహేష్ ఎలాంటి ట్వీట్ చెయ్యలేదని అభిమానులు బాధపడుతున్నారు. దీంతో మహేష్ రీసెంట్ గా ఒక ట్వీట్ చేసాడు.నిన్న నా పుట్టిన రోజు సందర్భంగా మీరు పంపించిన సందేశాలు, చూపించిన ప్రేమాభిమానాలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. మీరందరు కలిసి ఈ స్పెషల్ డే ని మరింత స్పెషల్ డే గా మార్చారు. ప్రతి ఏడాది ఇలాగే మద్దతు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేసాడు. అంతే కాకుండా చివర్లో లవ్ యు అని కూడా చెప్పడంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక అభిమానులైతే లవ్ యు మాటకి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. లవ్ యు అన్నా అంటూ రిప్లై కూడా ఇస్తున్నారు. మహేష్ ఎప్పటిలాగానే ఈ పుట్టిన రోజు కి కూడా విదేశాల్లో ఉన్నాడు.తన ఫ్యామిలీ తో కలిసి బర్త్ డే సెలెబ్రేషన్స్ ని జరుపుకున్నాడు. మహేష్ తన నెక్స్ట్ మూవీని దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)తో చెయ్యబోతున్న విషయం అందరకి తెలిసిందే.
![]() |
![]() |